ETV Bharat / city

Roads: తాగునీటి పైప్​లైన్​ కోసం రోడ్లను తవ్వారు.. నిధులులేక వదిలేశారు...

Mangalagiri Roads: ఆ ప్రాంతంలో అంతర్గత రోడ్లు ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. బాప్టిస్ పేట, భార్గవపేట, పాత మంగళగిరి, కొప్పురావుకాలనీ, సాయినగర్ ప్రాంతాలలో తాగు నీటి పైప్ లైన్ల కోసం చేపట్టిన పనులు పూర్తి చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు తవ్వేసి మట్టి అక్కడే వదిలేయడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. ఈ.వీ.ఓ నిధుల సమస్యతో గుత్తేదారు మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరొకరికి అప్పగించకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

Mangalagiri Roads
నిధులులేక రోడ్డు పనులను మధ్యలోనే వదిలేశారు
author img

By

Published : Oct 6, 2022, 9:48 AM IST

Updated : Oct 6, 2022, 10:02 AM IST

నిధులులేక రోడ్డు పనులను మధ్యలోనే వదిలేశారు

Roads Digging Problem: అడుగడుగునా గుంతలు.. అడ్డగోలుగా తవ్వకాలు.. రోడ్డు మధ్యలోనే ఎత్తుగా మట్టికుప్పలు.. కాలు బయటపెట్టాలంటేనే చిరాకుపడేలా ఉన్న ఆ మార్గంలో వాహనాలపై ప్రయాణమంటే ప్రమాదకరంగా మారిన పరిస్థి. ఇది గుంటూరు జిల్లా మంగళగిరిలో అంతర్గత రహదారుల పరిస్థితి. తాగునీటి పైపులైన్లు వేసేందుకు రోడ్లు తవ్వేసి వదిలేయడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. నిధుల విడుదల చేయకపోవడంతో గుత్తేదారులు మధ్యలోనే పనులు నిలిపివేశారు.

3 నెలల క్రితం తవ్విన రోడ్లు: గుంటూరు జిల్లా మంగళగిరిలో అంతర్గత రోడ్లు ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. బాప్టిస్ పేట, భార్గవపేట, పాత మంగళగిరి, కొప్పురావుకాలనీ, సాయినగర్ ప్రాంతాలలో తాగు నీటి పైప్ లైన్ల కోసం చేపట్టిన పనులు పూర్తి చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుత్తేదారు మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లిపోవడంతో.. 3 నెలల క్రితం తవ్విన రోడ్లు ఇంకా బాగు చేయలేదు. రోడ్డు మధ్యలో తవ్వడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

మధ్యలోనే పనులు వదిలేసిన గుత్తేదారు: రోడ్డు తవ్వేసి మట్టి అక్కడే వదిలేయడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. ఇరుకు రోడ్లు కావడంతో నడవడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు. వర్షాలకు మట్టి జారిపోతోందని వాపోతున్నారు. రాత్రి వేళ్లలో రాకపోకలు మరింత కష్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలుగా వీధుల్లోకి కూరగాయల బండ్లు, చెత్త సేకరించే వాహనాలు, రేషన్‌ వాహనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ.వీ.ఓ నిధుల సమస్య కారణంగానే గుత్తేదారు మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పైపులైన్‌ నిర్మాణ పనులు మరొకరికి అప్పగించకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

ఇవీ చదవండి:

Last Updated : Oct 6, 2022, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.