ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్‌జిల్లా ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.18 లక్షల విలువైన 46 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ, నరసరావుపేట, ముప్పాళ్ల, పెదకూరపాడు, గురజాల, అమరావతి, నకరికల్లు, దుర్గితో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా ద్విచక్రవాహనాలను దొంగిలించినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. వ్యసనాలకు బానిసై ఈ చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ చెప్పారు.
ఇదీచదవండి.