ETV Bharat / city

దిశ చట్టం.. రాష్ట్ర మహిళలకు వరం: మంత్రి సుచరిత

దిశ చట్టం రాష్ట్రంలో మహిళలకు వరం లాంటిదని హోం శాఖ మంత్రి సుచరిత అభిప్రాయపడ్డారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో దిశ చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు.

home minster on disha
దిశ చట్టంపై హోంమంత్రి
author img

By

Published : Dec 20, 2019, 9:16 PM IST

దిశ చట్టంపై హోంమంత్రి

దిశ చట్టం రాష్ట్రంలో మహిళలకు వరంలాంటిదని రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత అన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో దిశ చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. చిన్నారులపై అఘాయిత్యాలు జరగడం చాలా బాధాకరమని వాపోయారు. ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టం.. రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉందిని చెప్పారు. చట్టంపై బాలురకూ అవగాహన కల్పించాలన్నారు. హాజరైన మరో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. యువత సాంకేతికతను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి:

నిపుణుల కమిటీ సిఫార్సులపై రాజధాని రైతుల ఆగ్రహం

EJS Trainee : Saikumar Camera : ali Date : 20-12-2019 Centre : Guntur File : AP_GNT_08_20_DISHA_AVAGAHANA_SADASSU_AVB_9727010 యాంకర్ (...) దిశ చట్టం రాష్ర్ట మహిళలకు వరంలాంటిదని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి సుచరిత అన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో దిశ చట్టంపై అవగాహన సదస్సులో పాల్గోన్న ఆమె చిన్నారులపై అఘాయిత్యాలు జరుగడం చాలా బాధాకరమని వాపోయారు. దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉందిని తెలిపారు. చట్టంపై బాలురకు కూడా అవగాహన కల్పించాలన్నారు. దిశ చట్టాన్ని ఇతర రాష్ర్టాల వారు కొనియాడుతున్నారని అన్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అనంతరం పశుసవర్ధక , మార్కెటింగ్ మంత్రి మోపీదేవివెంకట రమణ మాట్లాడుతూ చట్టాల్లోని లోసుగుల వల్లే దారుణాలు చోటుచేసుకుంటున్నాయని, వాటిని అరికట్టడానికే జగన్ కట్టుదిట్టమైన చట్టాలను తీసుకువస్తున్నారని కొనియాడారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ యువత టెక్నాలజీని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. సామాజిక మద్యంలో అసభ్యకర పోస్టుల పై కూడా చర్యలు తీసుకొంటామన్నారు. వేరే రాష్ర్టాల మాదిరి దారుణాలు చోటుచేసుకోకముందే ముఖ్యమంత్రి జగన్ దిశ చట్టం తీసుకోచ్చారని అన్నారు. సీఐడీ డీజీ త్రివిక్రమ్ మాట్లాడుతూ మహిళలకు రాత్రి వేళల్లో అభయం వాహనం అందుబాటులో ఉన్నాయని, వాటిల్లో మహిళా కానిస్టేబుల్స్ అందుబాటులో ఉంటారని తెలిపారు. వాట్సప్ ద్వారా 392 ఫిర్యాదులు వచ్చాయని , మహిళలు చిన్నారులు ఎమర్జెన్సీ సమయంలో 100, 112 నంబర్లు నిరంతరం అందుబాటులో ఉంటాయని అన్నారు. బైట్ - సుచరిత, హోం శాఖ మంత్రి బైట్ - మోపిదేవి వెంకటరమణ రావు , పశుసంవర్థక శాఖ మంత్రి బైట్ - తానేటి వనిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బైట్- త్రివిక్రమ్ , సీఐడీ డీజీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.