ETV Bharat / city

రామచంద్రపై దాడికి పాల్పడింది తెదేపా కార్యకర్తలే: హోంమంత్రి

మాజీ న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడికి పాల్పడింది తెదేపాకు చెందిన వ్యక్తేనని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు, వివరాలను ఆమె మీడియా ముందు విడుదల చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా... తమ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని సుచరిత మండిపడ్డారు.

రామచంద్రపై దాడికి పాల్పడింది తెదేపా కార్యకర్తలే

author img

By

Published : Sep 30, 2020, 8:38 PM IST

Updated : Oct 1, 2020, 6:51 AM IST

రామచంద్రపై దాడికి పాల్పడింది తెదేపా కార్యకర్తలే

చిత్తూరు జిల్లాలో మాజీ న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడికి పాల్పడింది తెదేపాకు చెందిన వ్యక్తేనని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను విడుదల చేసిన ఆమె... చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా తమ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని వ్యాఖ్యానించారు. ఇదంతా వైకాపాకు ఎస్సీలను దూరం చేసే కుట్రగా అభివర్ణించారు. వైకాపా ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అగ్ర ప్రాధాన్యత ఉందన్నారు. గతంలో ఏనాడూ మార్కెట్ యార్డు చైర్మన్​గా దళితులకు అవకాశం ఇచ్చిన పరిస్థితి లేదని... ఇపుడు అన్ని వర్గాల వారికి పదవులు ఇచ్చిన ఘనత జగన్​కే దక్కుతుందన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలే అధికంగా ఉన్నారని హోమంత్రి స్పష్టం చేశారు. ఆ వర్గాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జగన్ సర్కారు ప్రయత్నిస్తుంటే... తెదేపా నేతలు పట్టాల పంపిణీని అడ్డుకున్నారని ఆరోపించారు. ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు, మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్టైతే... బీసీలపై దాడి అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఎక్కడ నేరం జరిగినా పోలీసులు సత్వరమే స్పందిస్తున్నారన్నారు. ఒకవేళ పోలీసులు తప్పు చేసినా...వారిపైనా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గతంలో చంద్రబాబు అధికారులకు స్వేచ్ఛ ఇవ్వలేదని... జగన్ ప్రభుత్వంలో వారు స్వేచ్ఛగా పని చేస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:

రైతు భరోసా కేంద్రాల నుంచి ఎరువుల హోం డెలివరీ ప్రారంభం

Last Updated : Oct 1, 2020, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.