Minister Sucharitha On Jinnah Tower: రాష్ట్రంలో వివాదాస్పందగా మారిన జిన్నా టవర్ అంశంపై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనదన్నారు. ఏ ఉద్దేశంతోనైనా ఉన్న కట్టడాలు తొలగించాలనడం సరికాదన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టాలనుకోవడం తప్పని వ్యాఖ్యానించారు. ఎవరు అధికారంలో ఉన్న ఏన్నో ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన చిహ్నాలను తొలగించాలనడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
'భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనది. ఏ ఉద్దేశంతోనైనా ఉన్న కట్టడాలు తొలగించాలనడం సరికాదు. శాంతిభద్రతల సమస్య వస్తే చూస్తూ ఊరుకోం. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టాలనుకోవడం తప్పు. కలాం పేరుతో కొత్త నిర్మాణాలు చేయండి... ఉన్నవి తొలగించవద్దు' - హోంమంత్రి సుచరిత
సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
ఇవాళ రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చాల్సిందేనని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ పేరు మార్చకపోతే తాము అధికారంలోకి వచ్చాక మారుస్తామని చెప్పారు. సర్ ఆర్థర్ కాటన్‌తో పాటు ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన వీరన్న అనే ఇంజినీర్‌నూ స్మరించుకోవాలన్నారు. విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్) పేరునూ మార్చాలంటూ సోము వీర్రాజు కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. కింగ్ జార్జ్ పేరెందుకని.. తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న పేర్లు పెట్టుకోవాలన్నారు.
ఇదీ చదవండి