మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ రెండో వర్ధంతిని చిలకలూరిపేట తెదేపా కార్యాలయంలో శనివారం నిర్వహించారు. హరికృష్ణ పార్టీకి చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పఠాన్ సమద్ ఖాన్, ఇనగంటి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
నందమూరి హరికృష్ణ రెండో వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా మడకశిర మండలం జమ్మానపల్లి గ్రామంలో ఆయన అభిమానులు, తెదేపా నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి: డిజిటల్ వేదికగా అవార్డులు అందుకున్న క్రీడాకారులు