ETV Bharat / city

ఎయిమ్స్​లో మౌలిక వసతుల అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

మంగళగిరి ఎయిమ్స్​లో మౌలిక వసతుల అభివృద్ధిపై కలెక్టర్ వివేక్ యాదవ్ సమీక్షించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్​కు వెళ్లే మార్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు.

gunturu collector review on AIIMS
gunturu collector review on AIIMS
author img

By

Published : Jun 3, 2021, 8:05 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్​లో మౌలిక వసతులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ చెప్పారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ప్రధానంగా అటవీ శాఖ నుంచి అదనంగా రెండెకరాల 42 సెంట్లు, రోజుకు 10 ఎంఎల్​డీల నీరు, విద్యుత్ లైన్లు, రహదారులు వెంటనే నిర్మించాలని చెప్పారు.

జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్​కు వచ్చే మార్గంలో ఉన్న డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలించాలన్నారు. మంగళగిరి నుంచి ఎయిమ్స్ వరకు నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి అటవీశాఖ నుంచి అదనంగా భూమి తీసుకోవాలని.. అందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. 6వ బెటాలియన్ నుంచి అదనంగా రెండెకరాల భూమి కావాలని ఎయిమ్స్ సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ చదవండి:

హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైన తితిదే

For All Latest Updates

TAGGED:

aims
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.