ETV Bharat / city

పొందుగల చెక్​పోస్ట్​ నుంచి రాష్ట్రానికి వచ్చిన 1.12 లక్షల మంది..

ఆంధ్రా - తెలంగాణ సరిహద్దు గల పొందుగల చెక్​పోస్ట్​ వద్ద నుంచి ఇప్పటివరకు 1.12 లక్షల మంది ఏపీకి వచ్చారు. వీరిలో మహారాష్ట్ర, రాజస్థాన్​ రాష్ట్రాల వారే ఎక్కువగా ఉన్నారు. వీరికి ఆయూష్​ వైద్యుడు శ్రీనివాస్​ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు.

guntur ponjdugula checkpost covid 19 centre update
పొందుగల చెక్​పోస్ట్​ వద్ద నుంచి ఏపీకి వచ్చిన 1.12 లక్షల ప్రజలు
author img

By

Published : Aug 13, 2020, 1:48 PM IST

గుంటూరు జిల్లా ఆంధ్రా - తెలంగాణ సరిహద్దులో గల పొందుగల చెక్​పోస్ట్​ వద్ద నాలుగు నెలల క్రితం కొవిడ్​-19 స్టేట్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్​ 7 నుంచి ఇప్పటివరకు ఈ కేంద్రం మీదుగా 1.12 లక్షల మంది ఏపీకి వచ్చారు. రాష్ట్రంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ కేంద్రంలోకి వెళ్లి థర్మల్​ స్క్రీనింగ్​ చేయించుకొని ఆధార్​ కార్డు ఆధారంగా పేర్లు నమోదు చేయించుకోవాలి. అనుమానం వచ్చిన వారికి స్వాబ్​ పరీక్షలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆయూష్​ వైద్యుడు శ్రీనివాస్​ నేతృత్వంలో వైద్యులు సరళాకుమారి, స్వర్ణలత, 20 మంది పారా మెడికల్​ సిబ్బంది నిత్యం పని చేస్తున్నారు.

ఇప్పటివరకు మహారాష్ట్ర నుంచి 421, రాజస్థాన్​ 279, మధ్యప్రదేశ్​ 53, గుజరాత్​ 34, దిల్లీ 14 మంది రాగా... ఇతర దేశస్థులు 48 మంది వచ్చారు. మిగతా వారంతా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. వీరిలో అనుమానం వచ్చిన 4813 మందికి స్వాబ్​ పరీక్షల ద్వారా నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 21 మందికి పాజిటివ్​ ఉన్నట్లు వైద్యాధికారులు నిర్ధారించారు.

ఇదీ చదవండి :

కొవిడ్ కేర్ సెంటర్​ను తనిఖీ చేసిన కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.