ETV Bharat / city

'ఇళ్ల పట్టాలకు అదనంగా నగదు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు' - ఇళ్ల పట్టాల మంజూరుకు 21 రూపాయలు ఫీజు

పేదలకు అందించే ఇళ్ల పట్టాలకు కేవలం రూ.21 మాత్రమే చెల్లించాలని, అంతకన్నా అదనంగా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు నగరపాలక కమిషనర్ చల్లా అనురాధ హెచ్చరించారు. అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తే జీఎంసీ కాల్ సెంటర్​కు​ ఫిర్యాదు చేయాలని సూచించారు.

గుంటూరు నగరపాలక కమిషనర్ చల్లా అనురాధ
గుంటూరు నగరపాలక కమిషనర్ చల్లా అనురాధ
author img

By

Published : Aug 11, 2020, 5:12 PM IST

ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇళ్ల పట్టాల మంజూరుకు లబ్ధిదారుల నుంచి రూ.21 కన్నా అదనంగా నగదు వసూలు చేస్తే చర్యలు తప్పవని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు రూ.21 మాత్రమే చెల్లించి వార్డు సిబ్బంది నుంచి రశీదు పొందాలని సూచించారు. అదనంగా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే జీఎంసీ కాల్ సెంటర్ నెంబర్లు 0863-2345103 / 104 / 105 కు ఫోను చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

గుంటూరు నగరంలోని 207 వార్డు సచివాలయాల పరిధిలో 62,025 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరైనట్లు అనురాధ తెలిపారు. అదనంగా డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిస్తే సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

ఇదీ చదవండి : 'శిరోముండనం బాధితుడిని కొందరు బలి చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.