ETV Bharat / city

గుంటూరు జీజీహెచ్​ రూపురేఖలను మార్చిన కరోనా

కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఎందరో అసువులు బాసారు. మరెందరో కొవిడ్​తో కష్టాలు పడ్డారు. కానీ మరో విధంగా కొన్నిరంగాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపడ్డాయి. కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రిగా సేవలు అందించిందిన గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మరిన్ని సదుపాయాలు, అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కరోనాతో యుద్ధంలో సన్నద్ధత, వేగం, కచ్చితత్వం మరింత పెంచిందని వైద్యులు అంటున్నారు.

Guntur ggh
Guntur ggh
author img

By

Published : Dec 2, 2020, 6:03 AM IST

జీజీహెచ్​ వైద్యసేవలపై వైద్యుల వ్యాఖ్యలు

గతంలో ఎన్నడూ చవిచూడని చేదు అనుభవాలు కరోనా వల్ల మానవాళికి ఎదురయ్యాయి. రాష్ట్రంలో మార్చి నెల నుంచి ప్రారంభమైన కొవిడ్ కేసుల తాకిడి జులై, ఆగస్టు మాసాల్లో తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తాజాగా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్న పరిస్థితిని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యసిబ్బంది సేవలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. గుంటూరు జీజీహెచ్​ కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రిలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వేలాది మందికి నిర్విరామంగా సేవలందించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో సేవలు, సదుపాయాలు సైతం గణనీయంగా మెరుగుపడ్డాయి. జీజీహెచ్​లో తొలి నాళ్లలో 10 కిలోలీటర్ల ఆక్సిజన్ ప్లాంటు మాత్రమే అందుబాటులో ఉండేది. అందరికీ అప్పట్లో హైప్రెజర్ ఆక్సిజన్ అందుబాటులో ఉండేదికాదు. కొవిడ్ అనంతరం కొత్తగా 20 కిలోలీటర్ల ఆక్సిజన్ ప్లాంటును అందుబాటులోకి తెచ్చారు. దీంతో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ఇప్పటివరకు మరణాల రేటు ఒకశాతం లోపు నమోదైంది.

మెరుగైన వైద్యసేవలు

జీజీహెచ్​లో 45 వరకు ఉన్న ఐసీయూ బెడ్ల సంఖ్య....100కి పెరిగింది. 250 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. కిడ్నీ, లివర్, ఊపిరిపిత్తులు పరీక్షలను వేల సంఖ్యలో నిర్వహించారు. పేదలకు ఖరీదైన మందులను అందించారు. కొవిడ్ దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టులు గణనీయంగా పెరిగాయి. కొత్తగా 100 మంది వరకు వైద్యులు అందుబాటులోకి వచ్చారు. 300 నుంచి 350 వరకు స్టాప్ నర్సుల పోస్టులు భర్తీ చేశారు. కొత్తగా పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. కొవిడ్​తో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ జీజీహెచ్​లో మెరుగైన వైద్య సదుపాయాలు సమకూరాయని.. ఇవి భవిష్యత్తు అవసరాలను తీర్చనున్నాయని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.

మహమ్మారిపై మొక్కవోని పోరాటం

సరైన మందులు లేని కొవిడ్ లాంటి అరుదైన వైరస్​పై పోరాటంలో సన్నద్ధత, ప్రణాళికను అమలుచేయడంలో వైద్యులు సమర్థవంతంగా పనిచేశారు. ఆనుపానులు తెలియని ప్రమాదకర వైరస్​కు ఎదురొడ్డి నిలిచారు. ఇన్​ఫెక్షన్​ను తరిమికొట్టేందుకు ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో పనిచేశారు. కొందరు వైద్యులు గంటల తరబడి పీపీఈ కిట్లలోనే మగ్గినప్పటికీ నిబద్ధతంగా పనిచేశారు. ఈ అనుభవం వైద్యులకు ప్రత్యేకమైనదని అంటున్నారు వైద్య నిపుణులు.

కరోనా వల్ల అన్ని రంగాలూ ప్రభావితమయ్యాయి. కొవిడ్ అందరికీ కొత్త పాఠాలు నేర్పింది. విపత్కర పరిస్థితుల్లో పనిచేసే పట్టుదలను నూరిపోసింది.

ఇదీ చదవండి : దుర్వాసన మధ్యే కాలం వెల్లదీస్తున్న బుగ్గవంక బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.