Government control on temples హిందువులు అప్రమత్తంగా లేకపోవడం వల్లే దేవాలయాల మీద ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోందని తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి పేర్కొన్నారు. ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాలపై ఉందని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో అన్యమత ప్రచారం ఎక్కువైందని, మత మార్పిడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో దేవాలయ, అర్చక వ్యవస్థలను పటిష్టం చేసే ఉద్దేశంతో గుంటూరు జిల్లా సీతానగరం కరకట్ట మీద ఉన్న గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో శ్రీభారతీ దేవాలయ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు.
‘‘హిందువులు ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలయాలపై దేవాదాయశాఖ లేని పెత్తనాన్ని చెలాయిస్తోంది. వేల ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి’’ -శివస్వామి, తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి
తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన ఆలయ భూములను ఈనాంఫేర్ రిజిస్టర్, రీసెటిల్‌మెంట్ సర్వేల ద్వారా గుర్తించవచ్చని తెలిపారు. సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి విష్ణువు, విశ్వహిందూ పరిషత్ విజయవాడ నగర అధ్యక్షుడు ఎస్.శ్రీనివాస్, అర్చకసమాఖ్య అధ్యక్షుడు ఆత్రేయబాబు, రాధామనోహర్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: