గుంటూరు నగరపాలక సంస్థ ఉప ప్లానింగ్ అధికారిణి, 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణకు మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఇప్పటికే రెండుసార్లు ఆక్రమ కట్టడాలని కూల్చివేశారని.. ఇప్పుడు మరోమారు అదే భవనం వద్ద కూల్చివేతకు రావడం సరికాదని కార్పొరేటర్ పేర్కొన్నారు. ప్రభుత్వం బీపీఎస్ అవకాశం ఇచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకుంటారని చెప్పినప్పటికీ కూల్చివేతకు డిప్యూటీ సిటీ ప్లానర్ (DCP) మరోమారు సిద్ధం కావడాన్ని కార్పొరేటర్ తప్పుబట్టారు.
రోడ్డుపై రాకపోకలకు అడ్డుగా ఉన్న వీధి వ్యాపారుల వాహనాలను పక్కకు జరిపించే ప్రయత్నం చేయాలని కోరితే.. ఆ విషయం పట్టించుకోకుండా కావాలని ఒకే భవనం నిర్వాహకుడిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే డీసీపీని బదిలీ చేయాలని నగర మేయర్, కమిషనర్‌ను కోరారు. బ్రాడీపేట 4వలైన్ మార్గంలో డీసీపీ చర్యలకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. ఆక్రమణలకు తాము వ్యతిరేకమే అని.. అయితే డీసీపీ తీరుపైనే అభ్యంతరమని చెప్పారు.
ఇదీ చదవండి: