ETV Bharat / city

'ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే సీఎం జగన్​ లక్ష్యం' - Urban Health Center

ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్​ పనిచేస్తున్నారని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. పాత గుంటూరు సుద్దపల్లి డొంకలోని ప్రగతి నగర్​లో వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

Urban Health Center Guntur
వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన
author img

By

Published : Jul 7, 2021, 4:45 PM IST

గుంటూరు నగరంలో 16 నూతన వైఎస్సార్​ పట్టణ ఆరోగ్య కేంద్రాలు నిర్మించనున్నట్లు మేయర్ మనోహర్ నాయుడు తెలిపారు. పాత గుంటూరు సుద్దపల్లి డొంకలోని ప్రగతి నగర్ వద్ద వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే ముస్తఫాతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. కొవిడ్ తరహా రోగాలకు ఇక్కడే వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక వైఎస్సార్ హెల్త్ క్లినిక్​ నిర్మిస్తున్నామని.. ఇక్కడ 10 పడకలతో కూడిన అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. పేదలు, నగర శివారు ప్రాంతాలకు చెందిన ప్రజలను దృష్టిలో ఉంటుకొని ఈ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. పేదలు ఇక ప్రైవేటు, పెద్ద ఆస్పత్రులకు వెళ్లాల్సిన పని లేదన్నారు.

ఇదీ చదవండి:

Chandrababu: రైతులను ఆదుకోవటంలో జగన్ విఫలం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.