ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ముందుకు రావడం అభినందనీయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఫుడ్ బ్యాంక్‌లను ఆయన ప్రారంభించారు. మంచి ఉద్దేశంతో నగరపాలక సంస్థ బృందం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ఆయన అభినందించారు. ఫుడ్ బ్యాంక్ ప్రారంభత్సోవానికి రావటం గర్వకారణంగా ఉందని అన్నారు.
ఈ విధానం ఎంతో బాగుందని.. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయసహకారాలు అందించాలని.. దీంతో పాటు అధికారులు చక్కని సహకారంతో పనిచేస్తే రానున్న రోజుల్లో ఆకలి బాధలు లేని గుంటూరును చూడవచ్చని అన్నారు. ఫుడ్ బ్యాంక్స్ అభివృద్ధికి చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటుకు రాజ్యసభ నిధులు అందిస్తానని ఎంపీ మోపిదేవి వెంకటరమణచెప్పారు. ఫుడ్ బ్యాంకులను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఫుడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇదీ చదవండి:
కాంగ్రెస్ ర్యాలీలో అపశృతి.. ఎడ్లబండిపై నుంచి జారిపడిన దామోదర రాజనర్సింహ