తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ సమీపంలో నల్లమల అడవిలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. కొన్ని కిలోమీటర్ల మేర చెట్లు కాలిబూడిదయ్యాయి. మంటలు చెలరేగే అడవి ప్రాంతానికి చేరుకోడానికి రహదారి లేకపోవడంతో అటవీశాఖ అధికారులు నానా ఇబ్బందులు పడుతూ గుడిగట్టు ప్రాంతానికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మంటలు సమీపంలోని మామిడితోటలకు కూడా వ్యాపిస్తాయని రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు మంటలు అదుపులోకి రావటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అడవిలోని విలువైన నారవేప కలప కాలిపోయినట్లు రేంజర్ రవీందర్‌నాయక్ తెలిపారు. అనుమతి లేకుండా అడవిలోకి ఎవరు వెళ్లినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: