Fire accident: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ టెంట్లో విద్యుత్ ఘాతం సంభవించింది. వెంటనే స్పందించిన పోలీసులు టెంట్‌ను విప్పేశారు. పాత టోల్ గేట్ వద్ద ట్రాఫిక్‌ను క్రమ బద్దీకరించినందుకు.. నిరసన తెలిపేందుకు వచ్చే వాళ్లను అడ్డగించేందుకు తాత్కాలికంగా టెంటు నిర్మించారు. అక్కడ నలుగురు పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో టెంట్ కు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన పోలీసులు.. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పెద్దగా ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: