పట్టాదారు పాసు పుస్తకాల కోసం గుంటూరు జిల్లా చినకాకాని రైతులు మంగళగిరి తహశీల్దారు కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళకు దిగారు. పాస్ పుస్తకాలు, అడంగళ్‌లో నమోదు చేసేవరకూ ఆందోళన విరమించేది లేదంటూ రాత్రివేళలోనూ కార్యాలయం వద్దే బైఠాయించారు. రెండ్రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని... ఆందోళన విరమించాలని అధికారులు కోరినా రైతులు శాంతించలేదు. ఈ నేపథ్యంలో అధికారులు రాత్రి సమయంలోనూ రికార్డులు పరిశీలించారు. డిజిటల్ సంతకం పని చేయకపోవడంతోనే ఈ సమస్యలు తలెత్తాయని మంగళగిరి తహసీల్దార్ తెలిపారు.
ఇదీ చదవండి