ETV Bharat / city

విస్తరిస్తున్న వైద్య, ఫార్మా రంగం - Growing hospitals in Guntur

కరోనా వైరస్‌ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో వైద్యం, ఫార్మారంగం వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా ఔషధాల వ్యాపారంలోకి పలువురు అడుగుపెడుతున్నారు. నూతన ఆసుపత్రులు ఏర్పాటవుతున్నాయి. కొవిడ్ కారణంగా ఆరోగ్యంపై చేసే వ్యయం పెరుగుతోంది. గతేడాది కన్నా ఈ ఏడాది ఔషధాల విక్రయాల్లో 20శాతంపైగా పెరుగుదలే అందుకు నిదర్శనం. గత 6 నెలల కాలంలోనే జిల్లాలో 22 నూతన ఆసుపత్రులు, వందకు పైగా మందుల దుకాణాలు ఏర్పాటయ్యాయి.

Expanding medical and pharma sectors in Guntur
ఔషధం...ప్రాణదీపం
author img

By

Published : Oct 7, 2020, 8:18 AM IST

గుంటూరు జిల్లాలో వైద్యరంగం, ఔషధ రంగంలో అనూహ్య పెరుగుదల కనిపిస్తోంది. నగరంలోని కొత్తపేట, బృందావన్‌ గార్డెన్స్‌, లక్ష్మీపురం, గుజ్జనగుండ్ల ప్రాంతాల్లో మందుల దుకాణాలు గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ప్రజలు మందులు వినియోగించటం విపరీతంగా పెరిగింది. హోం ఐసోలేషన్​కు అనుమతించటంతో ఇళ్ల వద్దే ఉండి వైద్యులు సూచించిన మందులు వాడుతున్నారు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటి బూస్టర్స్ ఎక్కువమంది వినియోగిస్తున్నారు. ఈ కారణంగానే మందుల అమ్మకాల్లో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది.

పెరిగిన విక్రయాలు...

జిల్లావ్యాప్తంగా హోల్ సేల్‌ దుకాణాలే 800, రిటైల్‌ దుకాణాలు 2వేల 500 ఉన్నాయి. అన్నిచోట్ల కలిపి సగటున రోజుకు 6 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరుగుతాయి. గుంటూరు, నరసరావుపేట వంటి ప్రధాన పట్టణాల్లో కొన్ని హోల్‌సేల్‌ షాపుల్లో సగటున రూ.2 లక్షల వరకు, మరికొన్ని షాపుల్లో రూ.50 వేల నుంచి లక్ష వరకు విక్రయాలు ఉండగా... మిగిలిన పట్టణాల్లో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ జరుగుతాయి.

కరోనాకు ముందురోజుకు రూ.4 నుంచి 4.50కోట్ల రూపాయల వరకు వ్యాపారం ఉండేది. ఇటీవలి కాలంలో బి కాంప్లెక్సు, విటమిన్‌ సి, డి, అజిత్రోమైసిన్‌, సిట్రజిన్‌, డోలో-650, మల్టీ విటమిన్స్‌, ఆవిరిపట్టే మిషన్లు బాగా విక్రయమవుతున్నాయని వ్యాపారవర్గాలు తెలిపాయి. కరోనా తీవ్రత దృష్ట్యా ఎవరికి వారు ఈ మందులను బాగా కొనుగోలు చేసి నిల్వలు పెట్టుకున్నారు. కొందరేమో కరోనా నియంత్రణలో భాగంగా వాటిని వేసుకుంటున్నారు. ఈ కారణంగా గతంలో కంటే వ్యాపారం రోజుకు మరో రెండు కోట్లు అదనంగా పెరిగిందని అంచనా.

వందకుపైగా లైసెన్స్​ల జారీ...

కరోనాకు ముందు ఔషధ దుకాణ లైసెన్సులకు సగటున నెలకు ఆరేడు దరఖాస్తులు వచ్చేవి. ప్రస్తుతం ఆ సంఖ్య మూడు రెట్లు పెరిగింది. మార్చి నుంచి ఇప్పటిదాకా కొత్తగా వందకు పైగా ఔషధ లైసెన్సులు జారీ చేశారు. ఇంకా కొత్తగా దుకాణాలు కోసం దరఖాస్తులు అందుతున్నాయి. కరోనా నేపథ్యంలో చాలామంది మందుల విక్రయాలు, ఫ్యాక్టరీలు నెలకొల్పడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వంద వరకు కొత్త లైసెన్సులు ఇచ్చారు.

గతేడాది విక్రయాలు 13వందల నుంచి 15 వందల కోట్లకు మించి లేవు. ఈ ఏడాది వ్యాపారం 17వందల కోట్లు దాటుతుందని భావిస్తున్నారు. కొత్తవారు చాలామంది ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న ఔషధ దుకాణలకు మాత్రమే కొద్దిగా లాభం ఉంటుందని.. బయట ఔషధ దుకాణలకు పెద్దగా లాభాలు ఏమి లేవని ఔషధ దుకాణల నిర్వాహకులు తెలుపుతున్నారు. లాక్​డౌన్​కు ముందు ఎంత వ్యాపారం ఉందో ఇప్పుడు అంతే వ్యాపారం ఉందని చెపుతున్నారు. జిల్లాలో కొత్తగా 22 ఆసుపత్రులు ఏర్పాటయ్యాయి. వైద్యరంగం వేగంగా పెరుగుతోందనటానికి ఇది కూడా నిదర్శనం.

ఇదీ చదవండి: ఈసెట్​లో మెరిసిన అచ్చమ్మ కుంట తండా కుర్రాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.