ETV Bharat / city

3 రోజుల అనిశా కస్టడీకి అచ్చెన్నాయుడు

author img

By

Published : Jun 24, 2020, 7:58 PM IST

Updated : Jun 24, 2020, 8:37 PM IST

ex minister actchannaidu ACB custody for three days

19:56 June 24

అచ్చెన్న ఏసీబీ కస్టడీకి అనుమతించిన అనిశా ప్రత్యేక న్యాయస్థానం

అచ్చెన్నాయుడిని 3 రోజులపాటు అనిశా అధికారుల కస్టడీకి అనిశా ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. మూడ్రోజులపాటు అచ్చెన్నాయుడిని ఆస్పత్రిలోనే విచారించాలని ఆదేశించింది. అచ్చెన్నాయుడితో పాటు ఇదే కేసులో ఎ1గా ఉన్న రమేష్‌ కుమార్‌నూ అధికారులు విచారించనున్నారు.  

ఈఎస్​ఐ అవకవతకల కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కొన్ని రోజుల కిందట అరెస్టు అయ్యారు. విచారణ చేపట్టిన  అనిశా న్యాయస్థానం.. అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అయితే ఆయనకున్న అనారోగ్యం దృష్ట్యా పోలీసుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని తెలిపింది. ఈ మేరకు గుంటూరు జీజీహెచ్​లో మాజీ మంత్రి చికిత్స పొందుతున్నారు. తాజా కస్టడీకి అనిశా అధికారులు అనుమతి కోరగా..మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే విచారించాలని న్యాయస్థానం అనుమతించింది. 

Last Updated : Jun 24, 2020, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.