ప్రజలు, ప్రభుత్వం కలిసికట్టుగా కరోనా సమస్యను ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా (కొవిడ్- 19) వైరస్ నివారణకు ప్రభుత్వం చేపడుతోన్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులు, వైద్య నిపుణులతో చర్చించారు. కరోనాను ఎదుర్కొనేందుకు పటిష్ట వైద్య, ఆరోగ్య యంత్రాంగం ఉందని సీఎం జగన్ వివరించారు. కరోనా విస్తరించకుండా ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తోందని వెల్లడించారు. జనతా కర్ఫ్యూకు ప్రతిఒక్కరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఇళ్లకే పరిమితం కావాలని సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు