గుంటూరులో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్, హెచ్డీఎఫ్సీ మ్యూచ్‌వల్ ఫండ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈక్వీటీ మార్కెట్లో పెట్టుబడి అవకాశాలు, మ్యూచువల్ ఫండ్స్ పై స్టాక్ మార్కెట్ నిపుణులు అవగాహన కల్పించారు. ఆర్థిక లక్ష్యాలపై స్పష్టత వుండాలని, దీర్ఘకాలిక పెట్టుబడులే ఉత్తమంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంతో అనేక విషయాలు తెలుసుకున్నామని మదుపరులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి