ఈసీ నిర్ణయం సరికాదు: ఉపసభాపతి కోన రఘుపతి - undefined
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపై వైకాపా నేతలు తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా నోటిఫికేషన్ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి లేదన్నారు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. కొన్ని పార్టీలకో, కొందరు వ్యక్తుల మేలుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో జరిగిన సంఘటనలపై ఫిర్యాదులు వస్తే అధికారులపై చర్యలు తీసుకోవచ్చు కానీ ఎన్నికలు రద్దు చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన 14 ఆర్ధిక సంఘం నిధులు రాకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఉపసభాపతి కోన రఘుపతి తెలిపారు.