ETV Bharat / city

'రోజుకు 2వేల కరోనా ర్యాపిడ్​ టెస్ట్​ కిట్ల తయారీ'

కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు సులభతరం కానున్నాయి. కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు విశాఖలోని మెడ్​టెక్​ జోన్​లో తయారవుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 2 వేల కిట్లు తయారవుతున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.

author img

By

Published : Apr 8, 2020, 4:04 PM IST

minister mekapati
minister mekapati
మీడియాతో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి

విశాఖలోని మెడ్‌టెక్ జోన్‌లో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీకి అనుమతి లభించిందని పరిశ్రమల శాఖ గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ కిట్లతో డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, పీసీఆర్ టెస్టులు చేయవచ్చని అన్నారు. కేవలం 55 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఈ పరీక్షలకు 2 నుంచి 3 రోజలు సమయం పడుతుందని మంత్రి వెల్లడించారు. త్వరలోనే వీటిని దేశంలోని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామని చెప్పారు. తక్కువ ఖర్చులోనే వీటిని తయారు చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రస్తుతం రోజుకు 2 వేల కిట్లు తయారవుతున్నాయన్న ఆయన.... మే నాటికి 7.5 లక్షల కిట్లు తయారు చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అవసరాలు తీరాక... ఇతర రాష్ట్రాలకు పంపుతామన్నారు. ఈ నెల 15 నుంచి వెంటిలేటర్ల తయారీ ప్రారంభమిస్తామని గౌతమ్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను పరిశీలించిన సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.