ETV Bharat / city

ZERO FIR: ఉద్యోగం ఇప్పిస్తానని లాడ్జికి తీసుకెళ్లి.. అక్కడ..? - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

ఓ మహిళ హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా.. ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఉద్యోగ విషయం మాట్లాడదామని గుంటూరు తీసుకొచ్చాడు. లాడ్జికి వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుందామన్నాడు. ఆమె విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో అత్యాచారం చేసి, నగ్న వీడియోలు తీసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అసలేం జరిగిందంటే..

crime news
crime news
author img

By

Published : Aug 21, 2021, 7:41 AM IST

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగింది గుంటూరులో కాబట్టి కొత్తపేట పోలీసులకు కేసును బదిలీ చేశారు. శుక్రవారం కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మహిళను అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య పరిచయం చేసుకున్నాడు.

ఆ మహిళ హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా.. తనకు తెలిసినవాళ్లు ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో 2021 జులై 11న ఆమెను ఉద్యోగ విషయం మాట్లాడదామని గుంటూరు తీసుకొచ్చాడు. రైలుపేటలోని ఓ లాడ్జికి వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుందామన్నాడు. ఆమె విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో అత్యాచారం చేశాడని, నగ్న వీడియోలు తీసినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది.

ఈ విషయం ఎవరికైనా చెప్పినా, తాను రమ్మని పిలిచినప్పుడల్లా రాకపోయినా ఆ వీడియోలు అందరికి చూపిస్తానని బెదిరించినట్లు పేర్కొంది. అప్పటినుంచి ఆ వీడియోలతో బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని దర్శి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు కేసును గుంటూరు కొత్తపేటకు బదిలీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: 'తాలిబన్​ సర్కారు ఏర్పాటులో చైనాదే ప్రధాన పాత్ర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.