దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ రాష్ట్రంలో వామపక్షాలు నిరసన చేస్తున్నాయి. గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద వామపక్షాల నిరసనలో సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత మధు పాల్గొన్నారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. డిమాండ్ల పరిష్కారంపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు. దిల్లీలో రైతు సంఘాలు చేస్తున్న నిరసనలకు మద్దతుగా సీపీఐ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ఆందోళన చేపట్టారు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద రైతు సంఘాలతో కలిసి నేతలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, తెదేపా, ఇతర రాజకీయ పార్టీ నేతలు, జిల్లా రైతు సంఘాలు పాల్గొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ ప్రభుత్వం అంటూ భాజపాకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు
ఇదీ చదవండి:
రాష్ట్రంలో అరాచకపాలన.. మాఫియా స్వైర విహారం: డీజీపీకి చంద్రబాబు లేఖ