ETV Bharat / city

'కొవిడ్ వార్డుల్లో పోరాడిన మమ్ముల్ని అక్కడే వేధిస్తున్నారు' - కొవిడ్ వారియర్స్ ధర్నా

ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కరోనా బాధితుల కోసం పోరాడిన మమ్ముల్ని నేడు అదే కరోనా వార్డులో ఉంచి వేధిస్తున్నారని కొవిడ్ వారియర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని గుంటూరు జీజీహెచ్​ ఎదుట వాపోయారు.

కొవిడ్ వారియర్స్ ఆవేదన
కొవిడ్ వారియర్స్ ధర్నా
author img

By

Published : Mar 24, 2021, 1:55 PM IST

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరు జీజీహెచ్​లో నాలుగు రోజులుగా కొవిడ్ వారియర్స్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఆ దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. నిరసనకారులను బలవంతంగా జీజీహెచ్​లోని నాట్కో కేర్ సెంటర్​కు తరలించారు. ఒకరోజూ అక్కడ చికిత్స అందించి మరుసటిరోజు కొవిడ్ వార్డుకు మార్చారని బాధితులు తెలిపారు. కనీసం మాస్కులు ఇవ్వకుండా అన్ని వార్డులు తిప్పుతున్నారని.. వైరస్ బాధితులతో కలిపి ఉంచుతున్నారని వాపోయారు.

కొవిడ్ వారియర్స్ ఆవేదన

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన మాకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. అధికారుల తీరుతో కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. సమస్యపై ప్రభుత్వం స్పందించే వరకు దీక్ష విరమించేది లేదని కొవిడ్ వారియర్స్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: సచివాలయంలో ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.