ETV Bharat / city

జలుబు మాదిరే కరోనా వస్తుంది: గుంటూరు జేసీ

కరోనా సోకిన వారు అభద్రతా భావానికి గురికావద్దని గుంటూరు జేసీ దినేశ్ కుమార్ సూచించారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వైరస్​ను అధిగమించవచ్చని అన్నారు. జలుబు మాదిరే కరోనా కూడా వస్తుందని అన్నారు.

guntur jc dinesh
guntur jc dinesh
author img

By

Published : Apr 28, 2020, 5:21 PM IST

ప్రజలు ఆందోళన చెందవద్దన్న జేసీ

కరోనా వైరస్​పై ప్రజలు అనవసరమైన భయాందోళనకు గురి కావద్దని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. గతంలో కలరా, ప్లేగు వ్యాధులను మానవాళి జయించిందన్న జేసీ... తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను అధిగమించడం సులువేవని అభిప్రాయపడ్డారు. జలుబు మాదిరే కరోనా కూడా వస్తుందని అన్నారు. గుంటూరు సర్వజనాస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన కోవిడ్ ఆస్పత్రి బ్లాకును ఆయన పరిశీలించారు. బారికేడ్లు, వైద్య సిబ్బంది సర్దుబాటుపై జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడుతో జేసీ చర్చించారు. అనంతరం మాడ్లాడిన జేసీ.. కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేయటం వల్లే కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుందని చెప్పారు. వైరస్ సోకినంత మాత్రాన ఆందోళన చెందనవసరం లేదని జేసీ అన్నారు. వైరస్ లక్షణాలు బయటకు కన్పించకుండానే వ్యాధి నిరోధకశక్తితో ఎక్కువమంది బయటపడుతున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.