రాష్ట్రంలోకి వచ్చేవారు తప్పనిరిగా 14 లేదా 28 రోజుల క్వారంటైన్ ను పాటించాల్సిందేనని గుంటూరు జిల్లా దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నివారణ, నియంత్రణకు అమలు చేస్తున్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంటు నిబంధనల కింద ఎక్కడివారక్కడే ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దు వరకు రాకూడదని.. వచ్చినా క్వారంటైన్ తప్పదని చెప్పారు. తెలంగాణలో పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రం.. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. గుంటూరులో కరోనా నియంత్రణ, లాక్ డౌన్ సమీక్ష సమావేశానికి హాజరైన ఐజీ... లాక్ డౌన్ విజయవంతంగా అమయ్యేందుకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: