ETV Bharat / city

"నా మతం 'మానవత్వం'.. నా కులం 'మాట నిలుపుకోవడం'" - సీఎం జగన్ గుంటూరు పర్యటన

పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. ఉపాధి లేని రోగులు పస్తులుండకుండా ఆరోగ్య ఆసరా ఇచ్చానని సీఎం జగన్ అన్నారు. గుంటూరులో వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా శస్త్రచికిత్సల తర్వాత రోజుకు రూ. 225 లేదా నెలకు రూ. 5 వేలు ఆర్థికసాయం అందజేయనున్నారు.

cm jagan on guntur tour
సీఎం జగన్ గుంటూరు పర్యటన
author img

By

Published : Dec 2, 2019, 1:38 PM IST

మంచి పాలన అందిస్తుంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. తన మతం, కులం గురించి కొందరు ఆరోపణలు చేస్తున్నారనీ.. నా మతం-మానవత్వం.. నా కులం-మాట నిలబెట్టుకోవడమని ఉద్ఘాటించారు. జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. 43 వేల బెల్ట్‌షాపులు రద్దుచేశామనీ.. పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. మంచి సమాజాన్ని ఇవ్వాలనేదే తన లక్ష్యమనీ.. మంచి పాలన అందితే ప్రజలు సంతోషంగా ఉంటారని అభిప్రాయపడ్డారు.

సీఎం జగన్ గుంటూరు పర్యటన
మాట నిలబెట్టుకున్నా

ఉపాధి లేని రోగులు పస్తులుండకుండా ఆరోగ్యశ్రీ ఆసరా ఇచ్చి.. పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. గుంటూరు జీజీహెచ్​లో వైఎస్​ఆర్ ఆరోగ్య ఆసరాకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా శస్త్రచికిత్సల తర్వాత రోజుకు రూ. 225 లేదా నెలకు రూ. 5 వేలు ఆర్థికసాయం అందజేయనున్నారు. లబ్ధిదారులకు సీఎం జగన్ చెక్కులు అందజేశారు. 836 చికిత్సలకు ఈ పథకం వర్తించునుంది. డిశ్చార్జి అయిన 48 గంటల్లోపు రోగి బ్యాంకు ఖాతాకు ఈ సాయం జమ అవుతుంది. ఒకవేళ సొమ్ము అందకపోతే 104 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి అడగొచ్చని సీఎం తెలిపారు.

సీఎం జగన్ గుంటూరు పర్యటన

ఇవీ చదవండి..

తిరుపతిలో తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశం

Intro:AP_ONG_11_02_ATTACK_ON_VILLAGERS_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...............................
ప్రకాశం జిల్లా కరవాది కి చెందిన యువకుడు రమేష్ రెడ్డి అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరిపై కత్తి తో దాడి చేశాడు. ఒంగోలు కర్నూలు రోడ్డు బైపాస్ వంతెన ఇసుక ట్రాక్టర్లు నిలుపు స్థలంలో జరిగిన ఈ దాడిలో కృష్ణారెడ్డి, హనుమారెడ్డి కి గాయాలు అయ్యాయి. ఇరువురు ఒంగోలులోని ప్రయివేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. దాడి సమయంలో జరిగిన పెనుగులాటలో తలకు, చేతికి స్వల్ప గాయాలు అవడంతో రమేష్ రెడ్డి రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రమేష్ రెడ్డి దురుసుప్రవర్తన తగ్గించుకోవాలని సూచించడంతో కోపం పెంచుకున్న రమేష్ రెడ్డి ఈ దాడికి యత్నించాడు. రమేష్ రెడ్డి పై గతంలో హత్యాయత్నం కేసు ఉన్నట్లు సిఐ తెలిపారు. కేసు విచారిస్తున్నామని అన్నారు.....బైట్
లక్ష్మణ్, సీఐ, ఒంగోలు

Body:ongole

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.