ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు స్థానంలో గుడ్డ, జనపనార సంచులను వినియోగించాలని.. గుంటూరు నగరపాలక కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. కమిషనర్ తన చాంబర్లో.. జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ గుంటూరు గూగుల్స్ ఆధ్వర్యంలో రూపొందించిన గుడ్డ సంచులను ఆవిష్కరించారు. ప్లాస్టిక్ క్యారి బ్యాగుల వినియోగం పెరిగితే.. పర్యావరణం, ప్రజారోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుందన్నారు. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారి బ్యాగుల వినియోగం, అమ్మకంపై నిషేధం ఉందని తెలిపారు.
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, పూర్తి నివేదిక ఇవ్వాలి: అనురాధ
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, పూర్తి నివేదిక ఇవ్వాలని.. నగర కమిషనర్ చల్లా అనురాధ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికార్లను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పోలింగ్ కేంద్రాలకి సంబంధించి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిచారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస వసతులు ఉండేలా చూడాలన్నారు.
ఇదీ చదవండి: