గుంటూరు జిల్లాలో వివిధ సమస్యలపై అభివృద్ధి మండలి సమీక్షా సమావేశంలో చర్చించారు. ఖరీఫ్‌లోగా కాల్వల మరమ్మతులకు ప్రణాళిక రచించామని జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీరంగనాథ రాజు చెప్పారు. జిల్లాలో నకిలీ పురుగు మందులు అమ్మకాలు విపరీతంగా పెరిగాయని.... వీటిని కట్టడి చేయాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. వినుకొండలో రూ.500 కోట్ల విలువైన వక్ఫ్ బోర్డ్ భూములు ఆక్రమణ గురయ్యాయని.. ఈ కబ్జాలను అధికారులు ఎందుకు ఖాళీ చేయించడం లేదని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రశ్నించారు.
కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజలలో అపోహాలున్నాయని... ప్రజాప్రతినిధులు అంతా వ్యాక్సిన్ వేసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోరారు. వ్యాక్సిన్‌పై ప్రచారలోపం ఉందని.. కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారి వరకు వ్యాక్సిన్ వేయించుకుని ప్రజల్లో చైతన్యం నింపాలని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: