Mandadam: రాజధానిపై హైకోర్టు తీర్పు అనంతరం మందడం దీక్షా శిబిరంలోని న్యాయదేవత విగ్రహానికి రాజధాని రైతులు పాలాభిషేకం చేశారు.ఇప్పటివరకు సేవ్ అమరావతి దిశగా సాగిన తమ ఉద్యమం ఇకపై బిల్డ్ అమరావతి దిశగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టంచేశారు. రాజధానిపై కోర్టు తీర్పు వచ్చేవరకు టీవీలో ఉత్కంఠగా వీక్షించిన రైతులు తీర్పు వెలువడగానే స్వీట్లు పంచుకుంటూ తమ హర్షాన్ని వ్యక్తంచేశారు. ఆకుపచ్చ రంగు జల్లుకుంటూ ఆనందోత్సాహాల్లో తేలియాడారు. వెలగపూడిలో అమరావతి విగ్రహం వద్ద బాణసంచా కాల్చారు. పోరాటంలో వివిధ ఘట్టాలను గుర్తుచేసుకుని పలువురు కన్నీటితో ఉద్వేగానికి లోనయ్యారు. సమష్టి కృషితో సాధించిన ఈ విజయాన్ని నిలబెట్టుకు తీరుతామని ధీమా వ్యక్తంచేస్తున్నారు.
ఇదీ చదవండి: TDP on Amaravati: వెంటనే అమరావతి నిర్మాణం చేపట్టాలి: తెదేపా