అధికార పార్టీ నాయకులు..తమ భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపిస్తూ రాజధాని ప్రాంతంలోని ఎస్సీ నేతలు ధర్నా నిర్వహించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి రేవు వద్ద ఆందోళన చేపట్టారు. వారసత్వంగా వచ్చిన తమ భూమిని మెట్ట ప్రాంతంగా మార్చి..స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, అధికారులు కుమ్మక్కై కాజేశారని ఆరోపించారు.
నది మధ్యలో ఉన్న భూమిని మెట్ట ప్రాంతంగా డీనోటిఫై చేసి తహసీల్దార్ డ్రైవర్ కుమారుడి పేరుతో..భూమిని విక్రయించారన్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలు, స్థానిక ఎమ్మార్వోపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి