సుప్రసిద్ధ గాయకుడు, గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల అమరావతి రైతులు సంతాపం తెలిపారు. వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెదపరిమిలో ఎస్పీ బాలుకు నివాళులర్పించిన తర్వాతే దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలని కోరుతూ రైతులు 284వ రోజు నిరసన దీక్షలు కొనసాగించారు.
మంగళగిరి, తాడేపల్లి,తుళ్లూరు మండాల్లోని రాజధాని గ్రామాల్లో రైతులు ఆందోళనలు నిర్వహించారు. దొండపాడులో మహిళలు గీతాపారయణం చేస్తూ నిరసనను తెలియజేశారు. అమరావతి కోసం తన వంతు కృషి చేస్తున్న వైకాపా ఎంపీ రఘురామరాజు చిత్రపటానికి కృష్ణాయపాలెంలో రైతులు పూలు, పాలాభిషేకాలు చేశారు.
ఇదీ చదవండి: త్వరలో నాపై దాడి జరగబోతోంది: రఘురామకృష్ణరాజు