అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి రూ.1150 కోట్లు కేటాయిస్తూ... ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని బాధితుల సంఘం విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. గుంటూరులో సమావేశమైన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం... జీవో విడుదలతోపాటు చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు ద్వారా అనివార్యంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే... ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా చెల్లింపులు జరపాలని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. న్యాయపరమైన అడ్డంకులు లేకుండా అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం వేలం వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండీ...