అనారోగ్యంతో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో చేరారు. ఎస్కార్ట్ సాయంతో అంబులెన్స్‌లో అచ్చెన్నను పోలీసులు ఆసుపత్రికి చేర్చారు. ప్రత్యేక అభ్యర్థన మేరకు.. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం అచ్చెన్నాయుడుకు అనుమతిచ్చింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున రమేశ్ ఆసుపత్రి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చెన్న దగ్గరికి ఎవరూ వెళ్లకుండా పహారా కాస్తున్నారు.
సంబంధిత కథనం: