ప్రేమించిన యువతితో వచ్చిన విభేదాల వల్ల ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. నరసరావుపేట మండలం గురవాయపాలేనికి చెందిన మహేష్ బీటెక్ పూర్తిచేసి దిల్లీలోని నోయిడాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించగా..ఆమెతే విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరులోని ఓ లాడ్జిలో రూం తీసుకున్న అతడు.. విషం తాగడం సహా, బ్లేడుతో చేయి కోసుకున్నాడు.
గదిలో శబ్దాలు రావడం గమనించిన లాడ్జి సిబ్బంది తలుపులు పగులగొట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.