గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య23 వేల 337కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 313 ఉన్నాయి. ఇక జిల్లాలోని పిడుగురాళ్లలో 87, నర్సరావుపేట 81, తెనాలి 76, పొన్నూరు 62, చిలకలూరిపేటలో 49, తాడికొండ 29, బాపట్ల 24, మాచర్ల 14, దుగ్గిరాల 11, గుంటూరు గ్రామీణం 10, మంగళగిరి 9, రెంటచింతలలో 9 కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 107 కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
కరోనా కారణంగా ఆదివారం నాడు 12 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో మరణించిన వారి సంఖ్య 223కు చేరుకుంది. కరోనా నుంచి 13,711 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి