- మార్గదర్శకాలు విడుదల
Vaccination Guidelines: 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జనవరి 3 నుంచి వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం కొవాగ్జిన్ టీకానే వేస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'నోరు అదుపులో పెట్టుకోండి'
Vellampalli on Vangaveeti protection: ప్రతిపక్ష నేతలు హద్దు మీరి మాట్లాడుతున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నోరు అదుపులో పెట్టుకోకపోతే అంతకంటే ఘాటుగా స్పందిస్తామని హెచ్చరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'పేరు మార్చకపోతే కూల్చేస్తాం'
Jinnah Tower issue: గుంటూరులోని జిన్నాటవర్ పేరు మార్చాలని భాజపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆ టవర్ కూలుస్తామని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వేడుకలపై ఆంక్షలు
NEW YEAR CELEBRATIONS: కరోనా నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలపై విజయవాడ పోలీసుల ఆంక్షలు విధించారు. రేపు రాత్రి బహిరంగ వేడుకలకు అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- యథాతథం
UP polls 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడురోజులు పర్యటించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర.. కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రణాళిక ప్రకారమే.. ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీలు తమను కోరాయని చెప్పారు. ఈ మేరకు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మరో రైల్వే స్టేషన్ పేరు మార్పు
Jhansi railway station new name: ఇప్పటికే రెండు రైల్వే స్టేషన్ల పేర్లు మార్చిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం.. తాజాగా మరో స్టేషన్ మారును మార్చుతున్నట్లు స్పష్టం చేసింది. ఝాన్సీ రైల్వే స్టేషన్‌ను... వీరాంగణ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌గా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భారీ భూకంపం
Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- గడువు పొడిగింపు
EPF nomination deadline: ఈపీఎఫ్ ఈ-నామినేషన్ జత చేయనివారికి శుభవార్త. డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ జత చేయవచ్చు. దీనికి ఇప్పటివరకు ఎలాంటి గడువు తేదీని నిర్ణయించలేదని పేర్కొంది ఈపీఎఫ్ఓ. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'బలమే.. బలహీనతగా మారొచ్చు'
Team India Batting Coach: కొన్నిసార్లు విరాట్ కోహ్లీ బలమే.. అతడి బలహీనతగా మారే అవకాశముందని అన్నాడు భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్. ఇక ఫామ్‌లేమితో సతమతమవుతున్న సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె.. తిరిగి పుంజుకునేందుకు శక్తిమేర ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- బర్త్‌డేకు రూ.కోట్లలో కానుకలు
Salman Khan: ఇటీవలే తన 56వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా చేసుకున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఈ పార్టీకి బీటౌన్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భాయ్‌కు రూ.కోట్లు విలువజేసే కారు, బ్రాస్లెట్లు కానుకగా ఇచ్చారు. మరి కత్రినా కైఫ్ ఏమిచ్చిందంటే? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.