ETV Bharat / city

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి ఆళ్ల నాని - ap health minister alla nani latest news

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా జలగణన డాటా కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు.

minister alla nani
minister alla nani
author img

By

Published : Dec 17, 2020, 7:53 PM IST

రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 2.15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిల్లా జల గణన డాటా కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని... పశ్చిమగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతాలకు ఉచిత బోర్ల ద్వారా నీటిని అందించే కార్యక్రమానికి ప్రభుత్వ శ్రీకారం చుట్టిందని తెలిపారు. వరి, ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి

అమరావతి ఉద్యమంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.