పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వైద్యాధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి ఇప్పటివరకు ఒక కేసు మాత్రమే నమోదైనట్లు వెల్లడించారు. అంతుచిక్కని వ్యాధి బాధితుల సంఖ్య 605కు చేరింది. ఇప్పటివరకు 536 మంది డిశ్చార్జి అయ్యారు. ఏలూరు ఆస్పత్రిలో 35 మంది, విజయవాడ ఆస్పత్రిలో 34 మంది చికిత్స పొందుతున్నారు. సాయంత్రం నివేదిక అందించనున్న నిపుణుల కమిటీ సీసం, నికెల్, ఆర్గానో క్లోరిన్, క్రిమిసంహారక అవశేషాలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: