విజయవాడ బందర్ రోడ్డులోని జల వనరుల శాఖ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ ముగిసింది. కాఫర్ డ్యామ్ రక్షణ ఏర్పాట్లపై ఈ సమ ావేశంలో చర్చించామని ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్కే జైన్ వెల్లడించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించామని తెలిపారు. పోలవరం రివర్స్ టెండర్లపై తమకు సమాచారం లేదని పేర్కొన్నారు. టెండర్ల అంశం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని జైన్ తెలిపారు. ప్రాజెక్ట్ ఖర్చుపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉందని... కేంద్రం వెంటనే నిధులు విడుదల చేయలేదని ఆయన అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే ముందు చేసిన ఖర్చుపై ఆడిట్ పూర్తి కావాలని వెల్లడించారు. ఈ బృందం శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనుంది.
" పోలవరం రివర్స్ టెండర్లపై సమాచారం లేదు" - RK JAIN
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ముగిసింది. కాఫర్ డ్యామ్ రక్షణ, పనుల్లో వేగం సహా ప్రాజెక్టు ఖర్చుపై చర్చించారు. అయితే... పోలవరం రివర్స్ టెండర్లపై మాత్రం తమకు సమాచారం లేదని ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్కే జైన్ తెలిపారు.