ETV Bharat / city

పెరుగుతున్న బాధితులు.. 345 కి చేరిన బాధితుల సంఖ్య - new members join in eluru hospital

eluru breakingeluru breaking
eluru breakingeluru breaking
author img

By

Published : Dec 7, 2020, 9:04 AM IST

Updated : Dec 7, 2020, 12:51 PM IST

09:00 December 07

అంతు చిక్కని సమస్యతో.. ఏలూరు ప్రభుత్వాస్వత్రిలో చేరుతున్న రోగుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. అస్వస్థతతో వరుసగా మూడో రోజూ పెద్ద సంఖ్యలో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు. మూర్చ, తలతిరగడం, నోట్లో నుంచి నురగ రావడం వంటి లక్షణాలతో ఇప్పటి వరకు 345 మంది ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స నుంచి కోలుకుని 180 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. పరిస్థితి విషమించి ఒకరు చనిపోయారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించినా.. అస్వస్థతకు కారణం ఏంటనేది ఇంకా అంతుబట్టడం లేదు. నిన్న రాత్రి నుంచి మరో 27 మంది రోగులు ఆస్పత్రిలో చేరారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితిని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్ సమీక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఏలూరు: కారణాలు తెలియక.. లక్షణాల ఆధారంగా చికిత్స

Last Updated : Dec 7, 2020, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.