రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని 25వ డివిజన్ శనివారపు పేట లోని ఎంపీపీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మంత్రి ఆళ్ల నాని వచ్చారు. పోలింగ్ బూత్‌లోకి ఓటు వేసేందుకు వెళ్లగా అక్కడ ఆయన ఓటు కనిపించలేదు. ఆయన ఓటు బదులు మరొక మహిళ పేరు మీద ఓటు ఉండటంతో అధికారులను ప్రశ్నించారు. తన ఓటు ఏమైందని పోలింగ్ అధికారుల దగ్గర ఆరా తీశారు. చివరకు ఎక్కడా ఓటు లేకపోవడంతో ఓటు వేయకుండానే ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: తిరుపతి పురపోరులో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్