ETV Bharat / city

బాధితుల శరీరాల్లో సీసం, నికెల్... రసాయనాలు, పాల కల్తీయే కారణం..! - reason for eluru un known disease

ఏలూరులో వచ్చిన వింత వ్యాధికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఐదు రోజులు గడుస్తున్నా పూర్తి వివరాలు తెలియకపోవడం సర్వత్రా ఆందోళనకు కారణమవుతోంది . రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో సీసం, నికెల్ వంటి భారలోహాలు పరిమితికి మించి ఉన్నట్టు వెల్లడైనా..మరింత లోతైన విశ్లేషణ కోసం జాతీయ పరిశోధనా సంస్థలకు ఆహార పదార్ధాలు, నీరు, పాలు, కూరగాయలు, రక్తం నమూనాలను ప్రభుత్వం పంపింది. వింత వ్యాధికి కెమికల్ కంటామినేషన్ , న్యూరో టాక్సిన్స్ కారణమై ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

lead discovered in eluru un disease victims
బాధితుల నమూనాలో సీసం గుర్తింపు
author img

By

Published : Dec 8, 2020, 11:44 AM IST

Updated : Dec 9, 2020, 3:51 AM IST

ఐదు రోజులు గడుస్తున్నా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని వింత మూర్చ రోగ కారణాలపై అస్పష్టత నెలకొంది. ప్రాథమికస్థాయిలో రోగుల రక్తంలో పరిమితికి మించి నికెల్, సీసం లాంటి భారలోహాలు ఉన్నట్టు గుర్తించినప్పటికీ .. మరింత లోతైన విశ్లేషణ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు రక్త నమూనాల్ని ప్రభుత్వం పంపించింది. ఈ రోగం గుట్టు కనుగొనేందుకు జాతీయ స్థాయిలోని పరిశోధనా సంస్థల బృందాలు ఏలూరులోని వివిధ ప్రాంతాకు వెళ్లి నమూనాలు సేకరించటంతో పాటు స్థానికంగా ఉన్న పారిశుధ్య పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధుల బృందం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కు చెందిన బృందం, ఎయిమ్స్ బృందం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులతో పాటు ప్రభావిత ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లోని నమూనాల్ని సేకరించాయి. ప్రస్తుతం ఈ వింత వ్యాధి క్రమేణా తగ్గుముఖం పడుతోందని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వింత రోగం బారిన పడి అస్వస్థతకు గురైన వారి నుంచి నమూనాలు సేకరిచి పరీక్షలు చేసినప్పటికీ ఇప్పటికీ ఇథమిత్థంగా రోగకారణాలేమిటన్నది తెలీరాలేదని వైద్య నిపుణులు వెల్లడించారు. కాయగూరలు తాజాగా ఉంచటానికి వాడే రసాయనాలు, పంటలపై చల్లుతున్న పురుగుమందులు కొంత వరకూ వింత రోగానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి స్థానికంగా దొరికే వంకాయలు, పచ్చిమిర్చి తదితర వాటిపై విపరీతంగా చల్లుతున్న పురుగుమందుల తాలూకు అవశేషాలు దీనికి కారణమై ఉండొచ్చన్నది ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేంద్ర బృందాలు, రాష్ట్ర బృందాలు పూర్తిగా నమూనాలు విశ్లేషించిన తర్వాత రోగ కారణాలేమిటన్నది తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఏలూరు నగరంలో నెలకొన్న పరిస్థితులను తగ్గిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్రభుత్వం.. పురపాలక శాఖ సరఫరా చేస్తున్న పంపునీటిని తాగవద్దని స్థానికులకు సూచనలు జారీ చేసింది. కూరగాయలను కూడా ఉప్పునీటిలో కడిగిన అనంతరమే వినియోగించాల్సిందిగా హెచ్చరికలు ఇచ్చారు. మరోవైపు స్థానికంగా వినియోగిస్తున్న పాలు, కూరగాయలు, ఆహారపదార్ధాలను , నీటిని మరోమారు పరీక్షలు చేయించాలని నిర్ణయించామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ప్రభుత్వాసుపత్రిలో సరిపడినన్ని పడకలు, మందులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. స్విమ్స్ తో పాటు ఇతర ఆస్పత్రుల నుంచి న్యూరాలజిస్టులను కూడా రప్పిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఈ ఎపిడమిక్ వ్యాధి ఏమిటో తెలీని పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నామని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఈ వింత వ్యాధికి కెమికల్ కంటామినేషన్ , పెస్టిసైడ్స్ లేదా న్యూరో టాక్సిన్స్ వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నం అయి ఉండొచ్చని భావిస్తున్నామని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

వింత మూర్చ వ్యాధి కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 561కి పెరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 81గా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఆస్పత్రి నుంచి ఇప్పటి వరకూ 450 మంది డిశ్చార్జి అయ్యారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు 29 మంది రోగుల తరలించారు. ఇ-కొలి లాంటి బ్యాక్టీరియాల పరిశీలనకు 22 నీటి నమూనాల సేకరించారు. ఇందులో పురుగుమందుల అవశేషాలున్నట్టు గుర్తించారు. సేకరించిన 62 రక్త నమూనాల్లో 10 నమూనాల్లో పరిమితికి మించి నికెల్ , సీసం ఉన్నట్టుగా తేలింది. దీంతో మరో 40 నమూనాలను ఢిల్లీలోని ఎయిమ్స్ కు పంపించారు.వెన్నెముక నుంచి తీసిన నమూనాల ద్వారా చేసిన కల్చర్ టెస్టుల్లోనూ వైరస్, బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని ప్రభుత్వం తెలిపింది. కణజాల పరీక్ష కోసం సీసీఎంబీకి పంపిన 10 నమూనాల తాలూకు ఫలితాలు రావాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఏలూరు ఘటనపై పూర్తి స్థాయిలో పరిశోధించండి: సీఎం జగన్

Last Updated : Dec 9, 2020, 3:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.