పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైద్యుడు మురళీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేయటాన్ని భారత వైద్య సంఘం ఓ పత్రికా ప్రకటనలో ఖండించింది. దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాసింది. డా. మురళీ కృష్ణపై చేసిన ఆరోపణలు నిరూపణ కాకముందే అరెస్ట్ చేయటం సరికాదని ఐఎంఏ అభిప్రాయడింది. 50 పడకలు ఉన్న ఆసుపత్రిలో 10 లక్షల రూపాయల విలువ చేసే రెమిడెసివీర్ మెడిసిన్ ఉందని, ప్రభుత్వానికి సంబంధించిన టెస్టింగ్ కిట్లు ఆసుపత్రిలో లభించినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ పూర్తి కాకముందే అరెస్ట్ చేయటాన్ని పరిశీలించాలని డీజీపీని లేఖలో కోరింది.
ఇదీ చదవండి: అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటివారినైనా విడిచిపెట్టొదు: సీఎం