ఏలూరుకు చెందిన ఈ ముగ్గురు బాలికలు ఈతలో రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు కైవసం చేసుకున్నారు. చిన్న వయసులోనే అత్యంత చురుకుదనం, నిరంతర సాధనతో పోటీల్లో విజయాలు అందుకున్నారు. త్వరలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ఈ ముగ్గురు నిరంతరం శ్రమిస్తున్నారు.
విజయవాడ కేంద్రీయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న అలంకృతి అనేక పోటీల్లో విజయాలు అందుకొంది. 30రాష్ట్ర స్థాయి పతకాలు, 15జాతీయ స్థాయి పతకాలను సాధించింది. బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ పోటీల్లోనూ పాల్గొంటుంది. అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆకాంక్ష కూడా ఈత పోటీల్లో విశేషంగా రాణిస్తోంది. ఏలూరులో తొమ్మిదో తరగతి చదుతున్న కృషి 20 జాతీయ, 4 అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సొంతం చేసుకొంది.
తల్లిదండ్రులు, కోచ్ వల్లే ఈ విజయాలు అందుకుంటున్నామని... బాలికలు చెబుతున్నారు. ఈ దశలో నిరంతర సాధన చేయడం వల్ల భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ(Good performance in swimming) చూపే ఆస్కారం ఉంటుందని కోచ్ గణేశ్ చెబుతున్నారు.
ఇవీచదవండి.