CWC team visits Polavaram: పోలవరం ప్రాజెక్టులో వరదల అనంతర పరిస్థితిని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నుంచి వచ్చిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఆదివారం పరిశీలించింది. వరదల సందర్భంగా నమోదు చేసిన నీటిమట్టాల వివరాలను కాంక్రీట్ అండ్ మేసనరీ డ్యాం డిజైన్స్ (సీఎండీడీ) డైరెక్టర్లు ఖయ్యుం మహ్మద్, దీపక్ భట్, అసిస్టెంట్ డైరెక్టర్ గురువా తివారీ తెలుసుకున్నారు. ప్రస్తుతమున్న మట్టాలను స్వయంగా చూశారు. స్పిల్‌వే నుంచి నీటి విడుదలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.
ఎగువ కాఫర్‌డ్యాం వద్ద చేపట్టిన పనులను చూసి జల వనరులశాఖాధికారులతో సమీక్షించారు. ఎగువ కాఫర్‌డ్యాం పనులకు ఉపయోగించిన మట్టిని నిల్వ చేసిన డంపింగ్ యార్డులను, ఫిష్‌ల్యాడర్ సమీపంలో గైడ్‌బండ్ పనులను చూసి వివరాలను సేకరించారు. గ్యాప్-1, గ్యాప్-3లతోపాటు పి రెగ్యులేటర్‌ను సందర్శించారు. అక్కడినుంచి పోలవరం గ్రామంలో సీడబ్ల్యూసీ నిర్వహిస్తున్న గేజ్ స్టేషన్‌కు వెళ్లి వరదలకు సంబంధించి ప్రాజెక్టునుంచి కిందికి ఎంత వరద వచ్చిందన్న వివరాలు తెలుసుకున్నారు.
ఇవీ చవదండి: