ETV Bharat / city

చావు మరీ ఇలా కూడా వెంటాడుతుందా?! పెళ్లింట విషాదం.. - Coconut tree fell down causes for death at Mogallu

Unexpected Death at Mogallu: కుమారుడికి పెళ్లి కుదిరింది. మరో రెండు వారాల్లో వివాహం జరగబోతోంది. బంధువులను పెళ్లికి పిలవడానికి శుభలేఖలు ఇచ్చేందుకు ఆనందంగా వెళ్లిన ఆ తండ్రి.. అంతలోనే అనూహ్యంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వెళ్తున్న దారిలో కొబ్బరి చెట్టు విరిగిపడి విగత జీవిగా మారాడు. ఈ దుర్ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో చోటు చేసుకుంది.

Coconut tree fell down causes for death
Coconut tree fell down causes for death
author img

By

Published : Mar 27, 2022, 5:53 PM IST

Accidental Death at Mogallu: కుమారుడికి పెళ్లి కుదిరిన సంతోషం ఎంతో సమయం నిలవలేదు. పెళ్లి పిలుపులకు శుభలేఖలతో ద్విచక్ర వాహనంపై వెళ్లిన ఆ తండ్రి అంతలోనే ఊహించని రీతిలో మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో జరిగింది.

కాళ్ల మండలం కొంపల్లికి చెందిన పెద్దిరెడ్డి వెంకటేశ్వర రావు (53) కుమారుడికి పెళ్లి కుదిరింది. ఏప్రిల్ 14న వివాహం నిశ్చయించారు. బంధువులను, మిత్రులను కుమారుడి కళ్యాణానికి ఆహ్వానించేందుకు శుభలేఖలు తీసుకుని బయలు దేరాడు. తన అన్న కొడుకుతో కలిసి ఆనందంగా బయటకు వెళ్లాడు. వెంకటేశ్వర రావు అన్న కొడుకు బైక్ నడుపుతుండగా వెనుక సీటులో ఆయన కూర్చుని మాటామంతీ జరుపుతూ ప్రయాణిస్తున్నారు. బైక్ ఓఎన్జీసీ రిగ్ సమీపంలోకి రాగానే అన్యూహ్యంగా కొబ్బరిచెట్టు విరిగి పడింది. అదే సమయంలో వీరిరువురూ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం చెట్టు కింద నుంచే వెళ్లింది. ఊహించని విధంగా వెనుక కూర్చున్న వెంకటేశ్వర రావు పైన బడిన కొబ్బరి చెట్టు అతన్ని లాగేసింది. బైక్ పైనుంచి పడిన ఆయన సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఈ ఘటనతో పెళ్లివారింట తీరని విషాదం చోటు చేసుకుంది.

ఇదీ చదవండి: మాట తప్పిన సీఎం జగన్ రాజీనామా చేయాలి : మాజీ మంత్రి పత్తిపాటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.