ఏలూరులో వింత వ్యాధితో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఆ వ్యాధితో నిన్న శ్రీధర్ అనే వ్యక్తి మృతి చెందారు. శ్రీధర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. మళ్లీ పోస్టుమార్టం చేయలంటూ.. మృతదేహం కోసం ఇంటికి వెళ్లారు. ఈ విషయంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేశాకే మృతదేహాన్ని ఇస్తారని.. మళ్లీ ఎందుకు తీసుకెళ్లడం అంటూ ఆవేదన చెందారు. దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఇదీ చదవండి: 'సీఎం ఏలూరు పర్యటనలో పెళ్లి వేడుకకే ప్రాధాన్యం ఇచ్చారు'